+91 80742 32119 contact@aurascan.in సోమ – శని, ఉదయం 10:00 – సాయంత్రం 5:00 (ఆదివారం సెలవు)

డిటాక్స్ & రీఛార్జ్

షట్ క్రియలు, ఉపవాసం, మూలికా రసాలు, స్ట్రెచింగ్, పూర్తి రిలాక్సేషన్.

షట్ క్రియలు

షట్ క్రియలు

శరీరాన్నీ మనసునూ శుభ్రం చేసే ఆరు యోగ శుద్ధి క్రియలే షట్‌క్రియలు — వీటిలో దగ్గరుండి నేర్పిస్తాం. ఇవి ఒంటి ఆరోగ్యానికి, శక్తి ప్రవాహానికి తోడ్పడి, లోతైన యోగా–ధ్యాన ప్రాక్టీస్‌కి సిద్ధం చేస్తాయి.

ఉపవాస నియమాలు

ఉపవాస నియమాలు

ఆరాస్కాన్ ఉపవాస నియమాలు:

నీరు తాగుతూ ఉండండి: తగినంత నీరు అవసరం

బాగా విశ్రమించండి: బరువైన పని, ఒత్తిడి వద్దు

మెల్లగా విరమించండి: పండ్లవంటి తేలికపాటి ఆహారంతో మొదలుపెట్టండి

శరీరం మాట వినండి: అనారోగ్యంగా అనిపిస్తే ఆపేయండి

మూలికా రసాలు

మూలికా రసాలు

మీ ప్రోగ్రామ్‌తో పాటు సెంటర్ మూలికా రసాలు సూచించవచ్చు. ఇవి సంప్రదాయ తయారీలు — మందులు కావు; ఏ జబ్బుకో కాదు, దినచర్యకు తోడుగా మాత్రమే:

రోజువారీ శక్తికి: ఉసిరి (ఆమ్లా) లేదా అశ్వగంధ

శుద్ధిలో భాగంగా: గోధుమగడ్డి లేదా వేప

భోజనం తర్వాత: అల్లం లేదా తులసి

మనసు తేలికపడటానికి: బ్రాహ్మి

సీజన్ అంతా: గిలోయ్ లేదా పసుపు

ఏ మూలికా తయారీ అయినా మొదలుపెట్టే ముందు డాక్టర్‌ని అడగండి — ముఖ్యంగా గర్భవతులు, పాలిచ్చే తల్లులు, మందులు వాడుతున్న వాళ్ళు.

స్ట్రెచింగ్

స్ట్రెచింగ్

ఆరాస్కాన్ స్ట్రెచింగ్:

ఒళ్ళు వంగడం మెరుగుదల

కండరాల బిగువు నుంచి ఉపశమనం

మెరుగైన రక్తప్రసరణ

అన్ని స్థాయిల వారికీ అనుకూలం

రిలాక్సేషన్

రిలాక్సేషన్

ఆరాస్కాన్ ప్రశాంత విశ్రాంతి:

1. హాయిగా పడుకోండి (2 నిమిషాలు): వీలైతే వెల్లకిలా, సౌకర్యమైన స్థితిలో

2. లోతైన శ్వాసలు (3 నిమిషాలు): లోతుగా పీల్చి, మెల్లగా వదులుతూ మనసు కుదుటపరచండి

3. పూర్తి శరీర విశ్రాంతి (10 నిమిషాలు): కళ్ళు మూసుకుని, బిగువంతా వదిలేసి, కేవలం నిశ్చలంగా ఉండటంపై దృష్టి పెట్టండి.

లోతైన విశ్రాంతికీ పునరుత్తేజానికీ ఒక సున్నితమైన సాధన.

మొదలుపెడదామా?

మీ మొదటి చెకప్ కోసం సెంటర్‌కి కాల్ చేయండి, లేదా అకౌంట్ తెరవండి.

WhatsApp